Wednesday, July 23, 2014

నా దేశం

పనికి రాని నిజం
అండలేని భుజం
ఆలోచన లేని జనం
అవినీతి చేసె కలం
దేశ దరిద్రతకు మూలం

ఆకలి ఆర్త నాదాలు
ఆవేశపు కక్షల ద్వేశాలు
అత్యాచారపు ఘోరాలు
దేశానికి పట్టిన  శాపాలు

ఆశయం లేని యువత
అశ్లీలతొ తిరిగె వనిత
పాలన పట్టని జనత
దేశపు ప్రగతిని కూల్చె కలత


చరితను ఎరిగి,మమతను పొసగి
దేశపు గతిని మార్చాలి
కళ్ళను తెరిచి, కలలను విడిచి
జాతిని జాగ్రుతం చెయ్యాలి 

జాలిపడనీ లొకాన్ని

జారిపడినవని జాలి పడనీ ఈ లోకన్ని
లేచినిలబడి ఏలు నీ కాలాన్ని
నిరాశ నిట్టుర్పులు నీడ నిలిచె సైంధవులు
నీ ఆశ,విశ్వసాలు నీ అండ ఉండె సైనికులు
కశ్టమనే కాళ రాత్రి కభళించుకు పొతుంటే
విజయపు వెలుగు రేఖను కాంక్షిస్తు,శ్రమ చేస్తు నిలబడు
నీ కన్నీటితొ కలబడు

Monday, July 14, 2014

దిగజారిన జర్నలిసం

దేశ చరిత మాకేల
జాతి భవిత మాకేల
జనం చస్తె మాకేల
కలం ఏడిస్తె మాకేల

కన్నె పిల్ల పైట జారింద,పరుగు పరుగునొచ్చి క్లిక్ చేస్త
పనికిరాని సినిమా వచ్చిందా,పద పద జనాల్లొకి ఎక్కిస్త
పొలిటీశ్యన్ పెండ్లాం ఏడ్చిందా,గబ గబ ఓ ప్రొగ్రాం చెసెస్త
హెరొయీన్ బాయి ఫ్రెండ్  మర్చిందా, అది దేశానికి ఎంత మేలో వివరిస్తా

జనం మెచ్చె గళం గొంతు నొక్కెశాం
సంఘన్ని సంస్కరించె భద్యతను మానేశాం

పెదవాని కెకలు ,వినిపించె రాతలు
రాల్చవులె కాసులు

బ్రేకింగు న్యూసుల సమరం లొ,జారిపొయిన జర్నలిసం విలువల్లొ
డబ్బె రా కలానికి సిరా ,పడితేంది పత్రికలకు చెర