Wednesday, July 12, 2017

ఆపరారా శివ ఆపలేవా శివ

యెడాది కొకవైపు హిమసీమలొ వెలిసేవు
ముష్కరులొ మద్యలొ మంచువై వెలిగేవు
నిను చూచుకర్మమున  మముచుట్టిన ముర్కులను
ఆపరారా శివ ఆపలేవా శివ

కారెక్కి, బస్సెక్కి ,కొండెక్కి,కొనెక్కి నిను కొల్చు వస్తుంటె
ఖాఫీరులనుకుంటు  మము  కాల్చి చంపుతుంటె
ఆపరారా శివ ఆపలేవా శివ

గుడ్డి రాజు పెట్టె మోసలి కన్నీరు
కుంటి మంత్రి చెప్పె ఇంతె కశ్మీరు
పగబట్టీ మము కోసె ఇంటి పత్రికలు
పొమ్మంది ఎవడంటు మము ఎత్తి పొడిచేరు

ప్రజాస్వామ్య పలనలొ పారని పచికలం
నిను నమ్మి నడుచు శాంతి సైనికులం
మా రక్ష నీవంటు  మళ్ళి కదిలేము
మా భక్షకులని  నీకు  వదిలెము
ఆపరారా శివ ఆపరారా శివ