Wednesday, July 12, 2017

ఆపరారా శివ ఆపలేవా శివ

యెడాది కొకవైపు హిమసీమలొ వెలిసేవు
ముష్కరులొ మద్యలొ మంచువై వెలిగేవు
నిను చూచుకర్మమున  మముచుట్టిన ముర్కులను
ఆపరారా శివ ఆపలేవా శివ

కారెక్కి, బస్సెక్కి ,కొండెక్కి,కొనెక్కి నిను కొల్చు వస్తుంటె
ఖాఫీరులనుకుంటు  మము  కాల్చి చంపుతుంటె
ఆపరారా శివ ఆపలేవా శివ

గుడ్డి రాజు పెట్టె మోసలి కన్నీరు
కుంటి మంత్రి చెప్పె ఇంతె కశ్మీరు
పగబట్టీ మము కోసె ఇంటి పత్రికలు
పొమ్మంది ఎవడంటు మము ఎత్తి పొడిచేరు

ప్రజాస్వామ్య పలనలొ పారని పచికలం
నిను నమ్మి నడుచు శాంతి సైనికులం
మా రక్ష నీవంటు  మళ్ళి కదిలేము
మా భక్షకులని  నీకు  వదిలెము
ఆపరారా శివ ఆపరారా శివ 




Tuesday, December 16, 2014

దేవుని మాట

నేనా రాసింది ,నేనా చెప్పింది
తల్లిని పిల్లని చంపమని
కత్తితొ మతమును పెంచమని
భయముతొ భక్తిని నింపమని
బందీలుగ భక్తులని మార్చమని

నేనా రాసింది ,నేనా చెప్పింది
నమ్మని మనిషిని నరకనమని
రక్తపు ప్రార్ధన చేయమని
పిల్లల చదువులు చెల్లవని
మగువల మానం చెరపమని

నేనా రాసింది ,నేనా చెప్పింది
జుట్టుకి బొట్టుకి పన్నులు కట్టమని
అందరు నన్నె మొక్కమని
అమాయకపు  తలలు తెంచమని
ఆధ్యత్మిక శూలం గుచ్చమని

నేనా రాసింది ,నేనా చెప్పింది
దేశం ముక్కలు చెయమని
ప్రజల హక్కులు దొయమని
బానిస భావం పెంచమని
ముసుగుల చాటున దాగమని

వినరా మనిషి మళ్ళొసారి
నిన్ను నడిపించుటకిచ్చా మతం
నీ స్వార్ధం తొ చేయకు దాన్ని హతం
మానవత్వం లేని మనసుతొ  చెసె
నీ  ప్రార్ధనెందుకు  రా, నువ్వు చావవెందుకు రా

Wednesday, July 23, 2014

నా దేశం

పనికి రాని నిజం
అండలేని భుజం
ఆలోచన లేని జనం
అవినీతి చేసె కలం
దేశ దరిద్రతకు మూలం

ఆకలి ఆర్త నాదాలు
ఆవేశపు కక్షల ద్వేశాలు
అత్యాచారపు ఘోరాలు
దేశానికి పట్టిన  శాపాలు

ఆశయం లేని యువత
అశ్లీలతొ తిరిగె వనిత
పాలన పట్టని జనత
దేశపు ప్రగతిని కూల్చె కలత


చరితను ఎరిగి,మమతను పొసగి
దేశపు గతిని మార్చాలి
కళ్ళను తెరిచి, కలలను విడిచి
జాతిని జాగ్రుతం చెయ్యాలి 

జాలిపడనీ లొకాన్ని

జారిపడినవని జాలి పడనీ ఈ లోకన్ని
లేచినిలబడి ఏలు నీ కాలాన్ని
నిరాశ నిట్టుర్పులు నీడ నిలిచె సైంధవులు
నీ ఆశ,విశ్వసాలు నీ అండ ఉండె సైనికులు
కశ్టమనే కాళ రాత్రి కభళించుకు పొతుంటే
విజయపు వెలుగు రేఖను కాంక్షిస్తు,శ్రమ చేస్తు నిలబడు
నీ కన్నీటితొ కలబడు

Monday, July 14, 2014

దిగజారిన జర్నలిసం

దేశ చరిత మాకేల
జాతి భవిత మాకేల
జనం చస్తె మాకేల
కలం ఏడిస్తె మాకేల

కన్నె పిల్ల పైట జారింద,పరుగు పరుగునొచ్చి క్లిక్ చేస్త
పనికిరాని సినిమా వచ్చిందా,పద పద జనాల్లొకి ఎక్కిస్త
పొలిటీశ్యన్ పెండ్లాం ఏడ్చిందా,గబ గబ ఓ ప్రొగ్రాం చెసెస్త
హెరొయీన్ బాయి ఫ్రెండ్  మర్చిందా, అది దేశానికి ఎంత మేలో వివరిస్తా

జనం మెచ్చె గళం గొంతు నొక్కెశాం
సంఘన్ని సంస్కరించె భద్యతను మానేశాం

పెదవాని కెకలు ,వినిపించె రాతలు
రాల్చవులె కాసులు

బ్రేకింగు న్యూసుల సమరం లొ,జారిపొయిన జర్నలిసం విలువల్లొ
డబ్బె రా కలానికి సిరా ,పడితేంది పత్రికలకు చెర

Tuesday, December 10, 2013

మరచిపొవుట అసాధ్యమా !

అందమైన జీవితాన్ని అంధకారం చెసినపుడు
కలలు కన్న కాలన్నికాళరాత్రి కమ్మినపుడు
తీపి తీపి బాసలన్ని మరిచిపొయి కదిలినపుడు
నిను వలిచిన ని వాణ్ని విదిలించుకు వెళ్ళినపుడు
నా సంతొషపు సంపదని దొచుకెల్లి పొయినపుడు
సంసారపు లొకంలొ నన్ను వదిలి నడిచినపుడు
నా కష్టసుఖం కానరాని కపురంకై కదిలినపుడు
నీ కన్నవారి పట్టుదలకు నా ప్రేమని చంపినపుడు
నా మనసెరుగని నిన్ను మరల కొరుట సాధ్యమ మరచిపొవుట అసాధ్యమా

Friday, March 1, 2013

లోకమంతా ఒంటరె

లోకమంతా ఒంటరెర తమ్ముడు
ని జీవితమే ఏకాకి ఎప్పుడు

తల్లి కడుపులోకి ఏ తోడుతో నివోచ్చేవు
చితిమంటల పైకి  నీ  నీడని  నివదిలేవు
నడిమద్యన బ్రతికే బ్రతుకు వింత రా
అది తెలుసుకుంటే నీకెల చింత రా
                                   ॥ లోకమంతా

చేతిలోన చెయ్యేసి కలకాలం ఉంటానని
చేసుకున్న బాసలన్నీ నేరవేర్చు కుంటానని
మనసుందని నమ్మితివ మనిషికి
మోసపోయి మిగిలితివ చివరికి
                                  ॥ లోకమంతా

కలలు కన్న జీవితమే కాన రాని రాత్రి లో
కంటిపాప వవెతికి అలిసే కలలరాణి బబ్రాంతిలో
నాది నాది అనుకున్నది నీది కకపొయెన
ఎవడెవడో సొత్తు వచ్చి ని ముంగిట వాలెన
                                ॥లోకమంతా