Monday, July 14, 2014

దిగజారిన జర్నలిసం

దేశ చరిత మాకేల
జాతి భవిత మాకేల
జనం చస్తె మాకేల
కలం ఏడిస్తె మాకేల

కన్నె పిల్ల పైట జారింద,పరుగు పరుగునొచ్చి క్లిక్ చేస్త
పనికిరాని సినిమా వచ్చిందా,పద పద జనాల్లొకి ఎక్కిస్త
పొలిటీశ్యన్ పెండ్లాం ఏడ్చిందా,గబ గబ ఓ ప్రొగ్రాం చెసెస్త
హెరొయీన్ బాయి ఫ్రెండ్  మర్చిందా, అది దేశానికి ఎంత మేలో వివరిస్తా

జనం మెచ్చె గళం గొంతు నొక్కెశాం
సంఘన్ని సంస్కరించె భద్యతను మానేశాం

పెదవాని కెకలు ,వినిపించె రాతలు
రాల్చవులె కాసులు

బ్రేకింగు న్యూసుల సమరం లొ,జారిపొయిన జర్నలిసం విలువల్లొ
డబ్బె రా కలానికి సిరా ,పడితేంది పత్రికలకు చెర

1 comment: