Friday, September 28, 2012

నీ ఊహె నను పిలిచే

నీ ఊహె  నను పిలిచే
నీ ధ్యాసే నను కలిచే

ఎక్కడ నువ్వున్న
మనసున్నది నీపైన
పక్కన లేకున్నా
నాలోనే నిను కన్నా

నిను కలిసిన ఆ క్షణమే స్వర్గంలో చేరానే
నిను వదిలిన తరునమునే నరకంలో తేలానే
నీతో గడిపిన గడియలనే గుర్తుకు వస్తుంటే
నీ  ప్రేమకు కరువై న మనసే వంటరి అయిపోయే

నీ  పలుకుల రివెర్  నా మనసుని ముంచే
నా చూపుకి కవర్ ని నవ్వే వేసే
నా మైండ్ ని లూటి చేసావా డియర్
ఐ లవ్ యు స్వీటీ ఐ కాంట్ లీవ్ హియర్

నువ్వొస్తే నా కలలో జనమంతా నిదురిస్త
నువ్వులేని లోకాన ఊ క్షణములో మరణిస్త

నా జీవిత బాగం పంచుకునే ప్రాణం ఎవరంటే
నీ రుపుకి బానిస న కనులే నువ్వని చెప్పిందే

నీ  నవ్వే లోకెర్ నా హార్ట్ కే వేశావ్
నీ నడకే డిక్టేటర్ నా దారినే మర్చావ్ 
ఐ లవ్ యు స్వీటీ ఐ కాంట్ లీవ్ హియర్

డబ్బు జబ్బు వద్దురా

వద్దుర బ్రదరు వద్దుర  బ్రదరు
డబ్బు కి దాసీ కాకుర బ్రదరు

అందరు ఉన్న ఎకకైతావ్
అన్ని ఉన్న బికారైతావ్
మొకమున నవ్వే వదులుకుంటవ్
నాలుక రుచినే మరిచి పోతావ్

కంప్యూటర్ తో కపురమేసి
సంపాదనలో సాంతం మరిచి
సాయంత్రం గూడు చేరే పైసల పక్షి
 ఆనందం అనుభందం అన్ని చచ్చి

తప్పురా బ్రదరూ తప్పురా బ్రదరూ
డబ్బే లైఫ్ కాదురా బ్రదరూ
స్నేహం బందం కొంచెం ఉంటె
లైఫ్ అంత నువ్ హ్యాపీ బ్రదరు

మారాజైన మదిలో భారం
మోయల్సిందే దొరకదు భేరం
ఖజానాలో నింపుకున్న కాసులన్నీ
కలిపి కట్ట కట్టెన కంట నీటికి
ఆప్యాయత తో తడిమే ఒక్క చేతికి ఎన్ని కోట్ల వేలువుందో తెలుసుకోర

రా రా బ్రదరూ  రా రా బ్రదరు
చేయి చేయి కాలపర బ్రదరు


Tuesday, September 25, 2012

ఓటు పాట

నిగ్గు తేల్చు నిజం చూడ
అంతు తేల్చ అవని చీడ
కుంభకోణ  రాచ మెడ
కులదోయ రారా

బాపూజీ బాట పట్టి
నేతాజీ పంతమేత్తి
ఈ యువత వెన్ను తట్టి
రణం చేయ రారా

ని ఓటుని  ఆ నోటు తో కాటికే నువ్వు పంపుతుంటే
దాగి ఉన్న నీతి తీసి మల్లి పురుడుపోసి రా
నిను నమ్మిన ని నెల ముద్దు బిడ్డవై కదలి రా రా

భారతమాత శృంకలాలు తెంచిన మహనీయుల
త్యాగఫలం దోచుకునే తుచ్యమైన నేతల
పదవి పట్టి బయటకిడ్చి జెండా నువ్వు పాతరా


Friday, September 14, 2012

మానవత్వం

చికటింట నింగిలోన తలుక్కుమన్న తారకాంతి
వేకువమ్మని తట్టిలేపే కోడి కుత పిలుపు నుంచి
కన్నబిడ్డ మొదటి పలుకు విన్న తల్లి మొకము నున్న వెలుగు నుంచి
జనులు పొగుడు వేల నాన్న కళ్ళ నిటి నుంచి
మనసుపడ్డ చిన్నదని కంటి కింద కసురు నుంచి
కష్టం మైన సుఖం చేసే స్నేహితుడి అండ నుంచి
పుట్టుకోచిన భావమే దైవత్వం
అది చూపిన మార్గమే మానవత్వం