Friday, September 28, 2012

డబ్బు జబ్బు వద్దురా

వద్దుర బ్రదరు వద్దుర  బ్రదరు
డబ్బు కి దాసీ కాకుర బ్రదరు

అందరు ఉన్న ఎకకైతావ్
అన్ని ఉన్న బికారైతావ్
మొకమున నవ్వే వదులుకుంటవ్
నాలుక రుచినే మరిచి పోతావ్

కంప్యూటర్ తో కపురమేసి
సంపాదనలో సాంతం మరిచి
సాయంత్రం గూడు చేరే పైసల పక్షి
 ఆనందం అనుభందం అన్ని చచ్చి

తప్పురా బ్రదరూ తప్పురా బ్రదరూ
డబ్బే లైఫ్ కాదురా బ్రదరూ
స్నేహం బందం కొంచెం ఉంటె
లైఫ్ అంత నువ్ హ్యాపీ బ్రదరు

మారాజైన మదిలో భారం
మోయల్సిందే దొరకదు భేరం
ఖజానాలో నింపుకున్న కాసులన్నీ
కలిపి కట్ట కట్టెన కంట నీటికి
ఆప్యాయత తో తడిమే ఒక్క చేతికి ఎన్ని కోట్ల వేలువుందో తెలుసుకోర

రా రా బ్రదరూ  రా రా బ్రదరు
చేయి చేయి కాలపర బ్రదరు


No comments:

Post a Comment