Wednesday, August 8, 2012

నేటి నక్సలిజం


విప్లవాల ఉపిరిలో ఉవ్వెత్తున లేచింది
ఉద్యమాల రూపంలో ఉరకలేస్తూ వచ్చింది
అణగారిన ప్రజల కొరకు ఆయుధాలు పట్టుకుంటే
గణతంత్ర రాజ్యంతో రోజు మొదలు కొట్టుకుంటే
చంపనిదే బతకమని చంపెందుకే బతకమని
పాత బడ్డ సిద్ధాంతం తన పంధనేపుడో మరచిపోతే
శత్రువెవరో తేల్చ కుండ సంఘాన్ని చంపుకుంటూ
ఆవేశపు కాంక్షలతో అడివిలోన తిరుగుకుంటూ
ఏ గమ్యం గుర్తులేని సమరాన్ని చేస్తివ
రాసుకున్న రాజ్యాంగం రాజీపడి రమ్మంటే
పోలీసు పగలకి ఎన్కౌంటర్ ఐ చస్తివ

సంఘాన్ని విడిచి పెట్టి సంస్కర్తవు కాలేవు
అసాంఘిక శక్తులతో అన్యాయం ఆపలేవు
ఇకనైన మేలుకో సమాజంలో కలసిపో


No comments:

Post a Comment