ఏ నామము రాస్తే కవితగును

ఏ నామముపలికితే కవినగుదును
ఏ నామమువిధాతకు వేదములిచ్చేనో
ఏ నామము జనులకు గీతను చెప్పెనో
ఏ నామము ఇహ పర బంధములు తెన్చునో
ఆ నామము తలుస్తూ రాస్తున్న
నే నడిచేద నువ్వు చూపిన జ్ఞాన తోవ
న బుద్దిని బ్రోవగ రవ
నిన్నే స్మరించెద ఓం నమో హయగ్రీవ !!
No comments:
Post a Comment