Tuesday, August 14, 2012

తల్లి భారతి వందనం

ఆది మానవ అనాగరికతకు 
ఆది జ్ఞానము వేదమిచ్చిన 
అంధకారపు అవని మొక్కకు 
వెలుగు రేఖ మొగ్గ పొడచిన 
నాటి కాలపు చరిత నీవు
నేటి కాంతుల వెలుగు నీవు

ఆదివిష్ణువు పాదమోసగిన
ఆది బిక్షువు నేల నడిచిన 
దేవ గీతను జనులకిచ్చిన దివ్య జాతిని కన్నా భూమి

రాచ రికపు మకుట మణిలో
ధర్మ రక్షణ కాచె పనిలో 
సాగిపోయిన  కాలానికి త్రోవ చూపిన దైవ ధరణి 

మొఘల్ ముర్కుల రాజ్యం చీల్చి
వలస అంగ్లుల పాలన కూల్చి 
తరతరాల జాతి తలయెత్తి  నిలబెట్టిన 
ఆ వీరులు చేసిన త్యాగాలు మరువకు మా ఏనాడూ 
శత్రువుని కరిగించే బాపూజీ ఆ  సహనం 
ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింఘుని ఆ దైర్యం 
యుద్ధ నీతి నేర్పించిన నేతాజీ నేతృత్వం 
పల్లె ప్రజల బతుకుల్లొ వెలుగు నింపే అల్లూరి
తెల్లవారి తుపాకికి గుండె చూపే టంగుటూరి 
వెను చూపని వాడు రా భరత మాత బిడ్డరా 
ఆ వీరఫల స్వతంత్ర భారతావనికి చైయెత్తి జై కొట్టరా


జై హింద్
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 



No comments:

Post a Comment