Thursday, August 9, 2012

ఋణం తీర్చు రా!!

స్వతంత్రానికై సమరము చేసి
స్వరాజ్యానికై అసువులు బాసి
తాతలు చేసిన త్యాగాలకు
నిన్ను గన్న ఈ నెలకు
ఋణం తీర్చు కోవాలి రణం చేయ రావాలి

ఆకలి కేకలు పెట్టేప్రజల
మొఖమున ముసి ముసి నవ్వే తెచ్చి
పేదల పిల్చే రక్కసి నేతల
పదవికి ఓటుతో పోటే పొడిచి
వేల ఏళ్ళ వేద భూమి
ఋణం తీర్చు కోవాలి రణం చేయ రావాలి

ముడనమ్మకం సమాధి చేసే
మూర్ఖత్వాన్ని  ముక్కలు చేసే
చదివిన చదువుల జ్ఞానం పంచి
చీకటి బతుకులకు వేకువనిచ్చి
నిన్ను సాకే   ఈ సంఘపు
ఋణం తీర్చు కోవాలి రణం చేయ రావాలి

ప్రపంచానికి సవాలు చేస్తూ
సంస్కారాన్ని సమన్వయిస్తూ
తామే ఘనమని ఉగే అధముల
ఆ ఘనతకి మూలం మేమని చెప్పి
భూమికి బతుకును నేర్పిన భారతమాత
ఋణం తీర్చు కోవాలి రణం చేయ రావాలి

No comments:

Post a Comment