Friday, September 28, 2012

నీ ఊహె నను పిలిచే

నీ ఊహె  నను పిలిచే
నీ ధ్యాసే నను కలిచే

ఎక్కడ నువ్వున్న
మనసున్నది నీపైన
పక్కన లేకున్నా
నాలోనే నిను కన్నా

నిను కలిసిన ఆ క్షణమే స్వర్గంలో చేరానే
నిను వదిలిన తరునమునే నరకంలో తేలానే
నీతో గడిపిన గడియలనే గుర్తుకు వస్తుంటే
నీ  ప్రేమకు కరువై న మనసే వంటరి అయిపోయే

నీ  పలుకుల రివెర్  నా మనసుని ముంచే
నా చూపుకి కవర్ ని నవ్వే వేసే
నా మైండ్ ని లూటి చేసావా డియర్
ఐ లవ్ యు స్వీటీ ఐ కాంట్ లీవ్ హియర్

నువ్వొస్తే నా కలలో జనమంతా నిదురిస్త
నువ్వులేని లోకాన ఊ క్షణములో మరణిస్త

నా జీవిత బాగం పంచుకునే ప్రాణం ఎవరంటే
నీ రుపుకి బానిస న కనులే నువ్వని చెప్పిందే

నీ  నవ్వే లోకెర్ నా హార్ట్ కే వేశావ్
నీ నడకే డిక్టేటర్ నా దారినే మర్చావ్ 
ఐ లవ్ యు స్వీటీ ఐ కాంట్ లీవ్ హియర్

డబ్బు జబ్బు వద్దురా

వద్దుర బ్రదరు వద్దుర  బ్రదరు
డబ్బు కి దాసీ కాకుర బ్రదరు

అందరు ఉన్న ఎకకైతావ్
అన్ని ఉన్న బికారైతావ్
మొకమున నవ్వే వదులుకుంటవ్
నాలుక రుచినే మరిచి పోతావ్

కంప్యూటర్ తో కపురమేసి
సంపాదనలో సాంతం మరిచి
సాయంత్రం గూడు చేరే పైసల పక్షి
 ఆనందం అనుభందం అన్ని చచ్చి

తప్పురా బ్రదరూ తప్పురా బ్రదరూ
డబ్బే లైఫ్ కాదురా బ్రదరూ
స్నేహం బందం కొంచెం ఉంటె
లైఫ్ అంత నువ్ హ్యాపీ బ్రదరు

మారాజైన మదిలో భారం
మోయల్సిందే దొరకదు భేరం
ఖజానాలో నింపుకున్న కాసులన్నీ
కలిపి కట్ట కట్టెన కంట నీటికి
ఆప్యాయత తో తడిమే ఒక్క చేతికి ఎన్ని కోట్ల వేలువుందో తెలుసుకోర

రా రా బ్రదరూ  రా రా బ్రదరు
చేయి చేయి కాలపర బ్రదరు


Tuesday, September 25, 2012

ఓటు పాట

నిగ్గు తేల్చు నిజం చూడ
అంతు తేల్చ అవని చీడ
కుంభకోణ  రాచ మెడ
కులదోయ రారా

బాపూజీ బాట పట్టి
నేతాజీ పంతమేత్తి
ఈ యువత వెన్ను తట్టి
రణం చేయ రారా

ని ఓటుని  ఆ నోటు తో కాటికే నువ్వు పంపుతుంటే
దాగి ఉన్న నీతి తీసి మల్లి పురుడుపోసి రా
నిను నమ్మిన ని నెల ముద్దు బిడ్డవై కదలి రా రా

భారతమాత శృంకలాలు తెంచిన మహనీయుల
త్యాగఫలం దోచుకునే తుచ్యమైన నేతల
పదవి పట్టి బయటకిడ్చి జెండా నువ్వు పాతరా


Friday, September 14, 2012

మానవత్వం

చికటింట నింగిలోన తలుక్కుమన్న తారకాంతి
వేకువమ్మని తట్టిలేపే కోడి కుత పిలుపు నుంచి
కన్నబిడ్డ మొదటి పలుకు విన్న తల్లి మొకము నున్న వెలుగు నుంచి
జనులు పొగుడు వేల నాన్న కళ్ళ నిటి నుంచి
మనసుపడ్డ చిన్నదని కంటి కింద కసురు నుంచి
కష్టం మైన సుఖం చేసే స్నేహితుడి అండ నుంచి
పుట్టుకోచిన భావమే దైవత్వం
అది చూపిన మార్గమే మానవత్వం

Tuesday, August 14, 2012

తల్లి భారతి వందనం

ఆది మానవ అనాగరికతకు 
ఆది జ్ఞానము వేదమిచ్చిన 
అంధకారపు అవని మొక్కకు 
వెలుగు రేఖ మొగ్గ పొడచిన 
నాటి కాలపు చరిత నీవు
నేటి కాంతుల వెలుగు నీవు

ఆదివిష్ణువు పాదమోసగిన
ఆది బిక్షువు నేల నడిచిన 
దేవ గీతను జనులకిచ్చిన దివ్య జాతిని కన్నా భూమి

రాచ రికపు మకుట మణిలో
ధర్మ రక్షణ కాచె పనిలో 
సాగిపోయిన  కాలానికి త్రోవ చూపిన దైవ ధరణి 

మొఘల్ ముర్కుల రాజ్యం చీల్చి
వలస అంగ్లుల పాలన కూల్చి 
తరతరాల జాతి తలయెత్తి  నిలబెట్టిన 
ఆ వీరులు చేసిన త్యాగాలు మరువకు మా ఏనాడూ 
శత్రువుని కరిగించే బాపూజీ ఆ  సహనం 
ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింఘుని ఆ దైర్యం 
యుద్ధ నీతి నేర్పించిన నేతాజీ నేతృత్వం 
పల్లె ప్రజల బతుకుల్లొ వెలుగు నింపే అల్లూరి
తెల్లవారి తుపాకికి గుండె చూపే టంగుటూరి 
వెను చూపని వాడు రా భరత మాత బిడ్డరా 
ఆ వీరఫల స్వతంత్ర భారతావనికి చైయెత్తి జై కొట్టరా


జై హింద్
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 



Thursday, August 9, 2012

ఋణం తీర్చు రా!!

స్వతంత్రానికై సమరము చేసి
స్వరాజ్యానికై అసువులు బాసి
తాతలు చేసిన త్యాగాలకు
నిన్ను గన్న ఈ నెలకు
ఋణం తీర్చు కోవాలి రణం చేయ రావాలి

ఆకలి కేకలు పెట్టేప్రజల
మొఖమున ముసి ముసి నవ్వే తెచ్చి
పేదల పిల్చే రక్కసి నేతల
పదవికి ఓటుతో పోటే పొడిచి
వేల ఏళ్ళ వేద భూమి
ఋణం తీర్చు కోవాలి రణం చేయ రావాలి

ముడనమ్మకం సమాధి చేసే
మూర్ఖత్వాన్ని  ముక్కలు చేసే
చదివిన చదువుల జ్ఞానం పంచి
చీకటి బతుకులకు వేకువనిచ్చి
నిన్ను సాకే   ఈ సంఘపు
ఋణం తీర్చు కోవాలి రణం చేయ రావాలి

ప్రపంచానికి సవాలు చేస్తూ
సంస్కారాన్ని సమన్వయిస్తూ
తామే ఘనమని ఉగే అధముల
ఆ ఘనతకి మూలం మేమని చెప్పి
భూమికి బతుకును నేర్పిన భారతమాత
ఋణం తీర్చు కోవాలి రణం చేయ రావాలి

Wednesday, August 8, 2012

నేటి నక్సలిజం


విప్లవాల ఉపిరిలో ఉవ్వెత్తున లేచింది
ఉద్యమాల రూపంలో ఉరకలేస్తూ వచ్చింది
అణగారిన ప్రజల కొరకు ఆయుధాలు పట్టుకుంటే
గణతంత్ర రాజ్యంతో రోజు మొదలు కొట్టుకుంటే
చంపనిదే బతకమని చంపెందుకే బతకమని
పాత బడ్డ సిద్ధాంతం తన పంధనేపుడో మరచిపోతే
శత్రువెవరో తేల్చ కుండ సంఘాన్ని చంపుకుంటూ
ఆవేశపు కాంక్షలతో అడివిలోన తిరుగుకుంటూ
ఏ గమ్యం గుర్తులేని సమరాన్ని చేస్తివ
రాసుకున్న రాజ్యాంగం రాజీపడి రమ్మంటే
పోలీసు పగలకి ఎన్కౌంటర్ ఐ చస్తివ

సంఘాన్ని విడిచి పెట్టి సంస్కర్తవు కాలేవు
అసాంఘిక శక్తులతో అన్యాయం ఆపలేవు
ఇకనైన మేలుకో సమాజంలో కలసిపో


మనవ యంత్రం

పంపే పైసల లెక్క చూసుకో
మిగిలిన చిల్లర జేబులేసుకో
అనుబందలకు నీళ్ళు వదులుకో
అర్దర్జన కై నడుమ్కట్టుకో

కాలే కడుపుల ఆకలి మరచి
ఆనందాల లోకం విడచి
యాంత్రికమైన స్నేహం వలచి
మనవ విలువకు చితినే పేర్చి

బతుకు బండి నడిపిస్తూ
బండ రాయిగా బతికేస్తూ
ఎన్నేళ్ళు ని పయనం
స్వార్ధం తో ని ప్రణయం

Tuesday, August 7, 2012

ఓ ఓటరు

ఓట్లు వేడగ వచ్చిన నేతల కోటలు దాటినా మాటలు విని ఆ కుటములకు ఓటు వేసినవ ఓ ఓటరు

నేడు కనీసం బియ్యపు మూటలు కూడా కొనలేక కాలిన కడుపుల కష్టపు మాటలు ఆ నేతకి చెబితే
వాని కపాల కాసే వాడి లాటిల కింద పడి వాతలు తేలేన నీ శరీరం

చేసిన తప్పుకు దెబ్బలు ముటకట్టుకుని ఆ నొప్పుల దాటికి తట్టుకోలేక ఒక క్వార్టర్ బాటిల్ కొట్టి నిదురిస్తివా

రాజ్యంగాన్నే వాడికి రాసిస్తివా

ఏకాకి ఇంజనీర్

ఉదయం నుంచి సంధ్యా వరకు
సంపాదనకి ఒకటే పరుగు
అందరు ఉన్న ఏకాంతంలో
నీతో నువ్వే పోటి పడుతూ
కాసులు రాల్చే రానీ పనికై
పోరాటంలో పాడైపోతు
వచ్చే సెలవు ఉదయం చూస్తూ
వారం పడిన శ్రమనే మరిచి
విశ్రాంతికై వెతికేలోపే
ఆదివారమే ఆవిరయనే


ఆపకు నీ పోరాటం

అలసి పోదు కష్టం నీకోసం
ఆగిపోదు కాలం నీకోసం
పారిపోదు ఏ దుక్కం ని నుంచి
వెతికిరాదు ఆనందం నిను వలచి
ఆశయమే ఆయుధమై వీటిపై పోరడు
ఆఖరికి ఈ అవనిలో ఒక అద్బుతమై నిలబడు

ఓం నమో హయగ్రీవ !!

ఏ నామము రాస్తే కవితగును
ఏ నామముపలికితే కవినగుదును
ఏ నామమువిధాతకు వేదములిచ్చేనో
ఏ నామము జనులకు గీతను చెప్పెనో
ఏ నామము ఇహ పర బంధములు తెన్చునో
ఆ నామము తలుస్తూ రాస్తున్న
నే నడిచేద నువ్వు చూపిన జ్ఞాన తోవ
న బుద్దిని బ్రోవగ రవ
నిన్నే స్మరించెద ఓం నమో హయగ్రీవ !!


Monday, August 6, 2012

శ్రీమతే రామనుజయ నమః

గురువులందరికీ గురుదైవమితాడు
లోకమేలే శ్రీనివాసుడే ఆయన ఘన శిష్యుడు
ఇల వైష్ణవం నిలకోల్ప వచ్చిన అది శేషుదితడు
హరి చరనంబే పరమమని నిరుపించేనితడు
నే రాసే ప్రతి మాటలు పలికే ప్రతి పలుకులు
ని అనుగ్రహ భాషణములు
నే సద వేడెద ని చరణంబులు
నను నడిపించ రావయ్యా రామానుజులు